అగ్నిప్రమాదాల నివారణపై ఫైర్ సిబ్బంది అవగాహన ప్రదర్శన
VZM: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం రాజాం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫైర్ సిబ్బంది విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగితే ఎదుర్కోవల్సిన జాగ్రత్తలను ఆసుపత్రి సిబ్బందికి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా బయటకు తరలించే విధానంపై ప్రాక్టికల్‌గా చూపించారు.