రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ELR: వివేకా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సుదీప్ బోరో (30) మృతి చెందాడు. మాల్దా జిల్లాకు చెందిన ఇతను చెంగనూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోకి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం స్టేషన్ మాస్టర్ సమాచారంతో రైల్వే హెచ్‌సీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.