'మదనపల్లిలో ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు వేగవంతం'

'మదనపల్లిలో ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు వేగవంతం'

అన్నమయ్య: మదనపల్లి బీటీ కాలేజీ గ్రౌండ్‌లో 4.91 ఎకరాల్లో ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సాంకేతిక అనుమతుల కోసం ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలని సూచించారు. క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్, కోర్టులు, ఓపెన్ జిమ్, మౌలిక వసతులతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.