సంతమాగులూరులో ఇంఛార్జ్ కలెక్టర్ సమావేశం

సంతమాగులూరులో ఇంఛార్జ్ కలెక్టర్ సమావేశం

BPT: సంతమాగులూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని బాపట్ల జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గంగాధర్ మంగళవారం పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో రెవెన్యూ పరమైన సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేయాలన్నారు. అనంతరం రీసర్వేకి సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.