భర్తకు అంత్యక్రియలు జరిపిన భార్య
SKLM: కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీలో గల గుంజులోవ గ్రామంలో విషాద ఘటన కలిచివేసింది. గ్రామానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు (40) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయనకు పదేళ్లు కూడా నిండని ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో భార్య తీర్లంగి రోహిణి భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి.