VIDEO: 'కొండకర్ల ఆవను కాపాడుకోవాలి'
AKP: రాష్ట్రంలోనే అతిపెద్ద సరస్సు అయిన కొండకర్ల ఆవను కాపాడుకోవాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆవ వద్ద ఐ లవ్ కొండకర్ల, సెల్ఫీ పాయింట్‌ను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవను అభివృద్ధి చేయడం ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఆవను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.