'స్టేడియం పనుల్లో వేగం పెంచాలి'
NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి పనులపై గురువారం ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మున్సిపల్ అధికారులతో (EE, DE, AE) సమీక్ష నిర్వహించారు. స్టేడియం పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనలో నాణ్యత పాటించాలని, యువతకు మెరుగైన క్రీడా వేదికను అందుబాటులోకి తెచ్చేలా మైదానాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.