గుంటూరులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి
GNTR: గుంటూరు నెహ్రునగర్ ఒకటో లైన్ వద్ద గుర్తు తెలియని (70) వృద్ధుడు మృతి చెందాడని ఆదివారం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ శవం ఆచూకీ తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.