ఘనంగా తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం

కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ సీడీపీవో విజయశ్రీ ఆదేశాల మేరకు సూపర్వైజర్ విజయ గౌరీ ఆధ్వర్యంలో ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాలే శిశువులకు శ్రేష్టం అని తెలియజేశారు.