'ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి'
NRML: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక RDO కార్యాలయం నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగేలా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు.