రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NRML: విద్యుత్ మరమ్మతుల కారణంగా నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ కాలనీ పరిధిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డీఈ నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి పనుల నిమిత్తమే ఈ అంతరాయం ఏర్పడుతోందని, కావున కాలనీవాసులు సహకరించాలని ఆయన కోరారు.