'చంద్రబాబు పరిపాలనపై దృష్టి పెట్టాలి'
VZM: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లడ్డు వ్యవహారాన్ని పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. సోమవారం గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు పక్కనపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి నాయకులు చూస్తున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.