రామయ్య విగ్రహప్రతిష్ఠలో పాల్గొన్న ఎంపీ
KDP: బద్వేలు పట్టణంలో తెలుగు గంగ కాలనీలో జరుగుతున్న శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డా. సుధ, తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు.