వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ

వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ

CTR: చిత్తూరు బీఎస్ కన్నన్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల వసతి గృహ నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో దీనిని నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భూమి పూజా కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి MLA ఆరని శ్రీనివాసులు, చూడ చైర్ పర్సన్ కటారి హేమలత పాల్గొన్నారు.