బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

ప్రకాశం: ఒంగోలు విజయనగర కాలనీకి చెందిన గురువయ్య, కుటుంబంతో కలిసి శనివారం అన్నవరపుపాడులో జరిగే వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతుండగా ఆయన కుమారుడు కనిపించకుండా పోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.