ఈనెల 20 నుంచి కేయూ పీజీ పరీక్షలు

WGL: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ(నాన్ ప్రొఫెషనల్) 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ట, అదనపు నియంత్రణాధికారి డా. బీఎస్ఎల్. సౌజన్య తెలిపారు. మే 20న మొదటి, 22న రెండో, 24న మూడో, 27న నాలుగవ, 29న ఐదో, 31న ఆరో పేపర్ పరీక్షలు ఉంటాయన్నారు.