VIDEO: బొల్లారంలో దోమల నివారణకు చర్యలు

SRD: బొల్లారం మున్సిపాలిటీలో దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి కమిషనర్ కిషన్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వార్డులలో దోమల నివారణకు ద్విచక్ర వాహనాలపై ఫాగింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సహకరించాలని, నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.