VIDEO: వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
KDP: పులివెందులలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.