VIDEO: భార్య విడిచిపెట్టి వెళ్లిందని సెల్ టవర్ ఎక్కిన భర్త

కోనసీమ: భార్య తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిందని భర్త సెల్ టవర్ ఎక్కిన ఘటన పి.గన్నవరంలో జరిగింది. జొన్నలలంకకు చెందిన పెసంగి సాయిబాబు..భార్య, భర్తల మధ్య చిన్నవివాదం జరగడంతో బంధువులు తన భార్యను తీసుకెళ్లినట్లు తెలిపాడు. తన భార్యను తనతోనే ఉంచాలని పి.గన్నవరం గోదావరి బ్రిడ్జ్ వద్ద హై టెన్షన్ వైర్ల టవర్ ఎక్కాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పడంతో కిందకి దిగాడు.