'నేడు పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు'
NTR: విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీస్ అధికార యంత్రాంగం భవాని ఉత్సవాల విరమణ కార్యక్రమంలో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రజలందరూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేటు ఫిర్యాదులు నిమిత్తం రావద్దని సూచించారు.