క్యూబా చేరుకున్న రష్యా చమురు ట్యాంకర్
రష్యా నుంచి అతిపెద్ద చమురు ట్యాంకర్ క్యూబాకు చేరుకుంది. మాస్కోకు చెందిన అనటోలీ కొలోడ్కిన్ అనే ట్యాంకర్ లక్ష మెట్రిక్ టన్నుల ముడి చమురుతో మటాన్జాస్ ఓడరేవుకు చేరింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తర్వాత క్యూబాకు చమురు సరఫరాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మూడు నెలలుగా చీకటిలో మగ్గుతున్న ఆ దేశానికి ఈ ట్యాంకర్ చేరడంతో క్యూబా అంధకారం నుంచి బయటపడనుంది.