వీధిలైట్లు మరమ్మతు పనులను పరిశీలించిన మండవ

వీధిలైట్లు మరమ్మతు పనులను పరిశీలించిన మండవ

NTR: నందిగామ పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డు శానిటేషన్, వీధిలైట్లు మరమ్మతు పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి పరిశీలించారు. అనంతరం స్థానికుల ద్వారా హైవే పై వీధిలైట్లు సమస్య వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకున్నారు. తక్షణమే స్పందించి నూతనంగా మూడు నూతన లైట్లు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విశ్వనాధపల్లి వాణి పాల్గొన్నారు.