కలెక్టరేట్‌లో నేడు అర్జీల స్వీకరణ

ATP: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ భవన్లో నిర్వహించబడుతుందని డీఆర్ మాలోల తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.