తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
TPT: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం బాగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 68,754 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 25,569 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లుగా నమోదైందనట్లు అధికారులు వెల్లడించారు.