ఉన్నదే ఇద్దరు.. టీచర్లేమో నలుగురు

NLR: వెంకటాచలం మండలం కురిచెర్లపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల కోసం నలుగురు ఉపాధ్యాయులను నియమించారు. ఒకరు పాఠాలు చెబుతుండగా..మిగిలిన ముగ్గురు ఖాళీగా ఉండాల్సిందే. దీనిపై వివరణ కోరగా.. ఎంఈవో శుక్రవారం మాట్లాడుతూ.. పని సర్దుబాటులో భాగంగా రెండు రోజుల క్రితం ఒకరిని కుంకుంపూడి పాఠశాలకు పంపామన్నారు.