దాడి ఘటనపై పలువురుపై కేసు నమోదు

దాడి ఘటనపై పలువురుపై కేసు నమోదు

KMM: భూతగాదాల నేపథ్యంలో జరిగిన దాడిపై మంగళవారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మంగాపురం తండాకు చెందిన భూక్య పూష, ఆమె భర్త రామచంద్రు గత శుక్రవారం సాయంత్రం బైకుపై పొలం నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన కొండలరావు అడ్డుకొని దాడి చేశాడు. ఈ ఘటనలో పూష తీవ్రంగా గాయపడగా బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.