అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఊరి చివర ఓ గుడిసెలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఇవాళ ఉదయం యజమాని వచ్చి చూసే సరికి వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై సుభాష్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రోజు కూలీ పని చేసుకొని జీవించే కర్ణాటక రాష్ట్ర ఉడిపికి చెందిన రామ్ చరణ్‌గా గుర్తించారు.