నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ మద్దతిచ్చింది: జీవన్ రెడ్డి
TG: నాదెండ్ల భాస్కరరావు అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ఆనాడు నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కర్ రావును మంత్రిపదవి నుంచి తొలగించినప్పుడు, ఆయనకు మద్దతుగా తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు.