విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజలు చేసిన మంత్రి

విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజలు చేసిన మంత్రి

ELR: లో ఓల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. నిడమర్రు మండలం పెద నిండ్రాకొలనులో రూ.3 కోట్ల 97 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆదివారం మంత్రి భూమి పూజలు చేశారు. ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు, అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.