అమృత్ 2.0 పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

అమృత్ 2.0 పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

JGL: ధర్మపురిలో అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ గురువారం పరిశీలించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి వాటర్ ట్యాంకర్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనుల నాణ్యత, సామర్థ్యం, పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.