నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వాతావరణం మారింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు, రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సాయంత్రం 6 దాటితే ప్రజలు బయటకు రావడానికి వణికిపోతున్నారు.