కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్
VSP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.