రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

MHBD: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయలైన ఘటన గండీడ్ మండల పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వెన్నచెడు గ్రామానికి చెందిన హనుమంతు(35), తండ్రి రామయ్య, మహబూబ్ నగర్ వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డుకిరువైపులా ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతుకు రెండు చేతులు విరుగగా స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ లో ఆసుపత్రికి తరలించారు.