సర్పంచి పదవికి జర్నలిస్టు నామినేషన్
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామం సర్పంచ్ పదవికి సీనియర్ జర్నలిస్టు పంజాల ఆంజనేయులు గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. గత గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యుడిగా ఎన్నికై, ఉప సర్పంచ్‌గా ఎన్నికై విధులను నిర్వహించారు. గ్రామస్తుల మద్దతుతో సర్పంచి పదవికి పోటీ చేస్తున్నట్లు ఆంజనేయులు గౌడ్ వివరించారు.