ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం నా బాధ్యత: కోరం

BDK: ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆపత్కాలంలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా బాధ్యత అని పేర్కొన్నారు.