'గ్రామ సర్వేయర్ల క్యాలెండర్ ఆవిష్కరణ'

'గ్రామ సర్వేయర్ల క్యాలెండర్ ఆవిష్కరణ'

SKLM: పాతపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా గ్రామ సర్వేయర్ల సంఘం నాయకులు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్వేయర్ల సంఘం నాయకులు ఎమ్మెల్యేకి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా గ్రామ సర్వేయర్ల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.