అంగన్వాడి కేంద్రంలో చిన్నారికి అక్షరాభ్యాసం

NLG: పెద్దవూర మండలం చలకుర్తి సెక్టారులోని చలకుర్తి 02 అంగన్వాడీ కేంద్రంలో, మంగళవారం మల్లెపళ్లి శేఖర్, శ్రావణిల కుమార్తె వర్షకు అంగన్వాడీ టీచర్ శాంతమ్మ అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసే బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.