అనంతపురంలో మతసామరస్యం
ATP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మతసామరస్యం వెల్లివిరిసింది. హిందూ ముస్లిం సోదరులంతా ఒక్కటేననే భావనతో తెలుగుదేశం పార్టీ నాయకుడు గౌస్ మోహిద్దీన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎండ తీవ్రత దృష్ట్యా ర్యాలీలో పాల్గొన్న భక్తులకు, హిందూ సోదరులకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.