సూర్యాపేటకు సాగునీరు హామీ: మంత్రి
SRPT: శ్రీరాంసాగర్ రెండో దశ ఆధునీకరణతో సూర్యాపేట చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సూర్యాపేటలో జరిగిన ర్యాలీ, బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశంలో తొలిసారి 85% మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కోరారు.