VIDEO: సీజ్ చేసిన వాహనం దగ్ధం
AKP: నర్సీపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గంజాయి కేసులలో పట్టుబడిన వాహనాలను స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. అయితే ఓ వ్యక్తి సిగిరేట్ తాగి అక్కడే పడేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఒక వాహనం దగ్ధం అయింది.