తహసీల్దార్ కార్యాలయంలో 'కీలక' బీరువా మాయం
SRPT: చిలుకూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో బీరువా చోరీ కలకలం రేపుతోంది. విలువైన సామగ్రిని వదిలి, కేవలం రికార్డులున్న బీరువాను మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అక్రమ కుల ధ్రువీకరణ పత్రాల దందాకు సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకే 'ఇంటి దొంగలు' ఈ పని చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసులకు అధికారులు ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవడంతో ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.