VIDEO: నూతన సర్పంచ్‌లను అభినందించిన హరీశ్ రావు
SDPT: పట్టణంలోని ఎమ్మెల్యే హరీశ్ రావు క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం కోలాహలంగా మారింది. ఆయనను కలవడానికి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు నూతన ప్రజాప్రతినిధులను అభినందించి శాలువాలు కప్పి సన్మానించారు. క్యాంపు కార్యాలయం వద్ద పండుగ వాతావరణంచ నెలకొంది.