'ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సహకారం అందిస్తాం'

E.G: కడియం మండలం కడియపులంక గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ కమిటీ తొలి సమావేశం కమిటీ ఛైర్మన్ వెలుగుబంటి ప్రసాద్ అధ్యక్షతన గురువారం జరిగింది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తామన్నారు. MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో శాశ్వత భవన ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.