VIDEO: రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో ప్రస్థావించిన MLA
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో అధ్వాన్నంగా మారిన R&B రోడ్ల దుస్థితిపై అసెంబ్లీలో సిర్పూర్ MLA హరీష్ బాబు ప్రస్థావించారు. పెంచికల్ పేట్ తదితర అటవీ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై, RTC బస్సులు సైతం తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అటవీశాఖ అనుమతులు సాధించి, తక్షణమే రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.