టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సుంకర పావని

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సుంకర పావని

కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావనికి టీడీపీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత దక్కింది. పార్టీ కష్టకాలంలో ఉన్నా, గతంలో కొందరు నేతలు వైసీపీకి సహకరించినా ఆమె టీడీపీలోనే కొనసాగారు. ఆమె నిబద్ధతను గుర్తించిన అధిష్ఠానం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించింది. విద్యాధికురాలైన పావని నియామకం పట్ల పేపకాయలపాలెం గ్రామస్థులు, పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.