'విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది పుస్తకాలే'
MHBD: విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేది పుస్తకాలే అని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రాములు తెలిపారు. తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 'గిఫ్ట్ ఏ బుక్-గిఫ్ట్ ఏ ఫ్యూచర్' పుస్తక విరాళాల కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ పుస్తకాలను ఇచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు దాతలు పుస్తకాలు ఇవ్వాలని కోరారు.