అమెరికాలో భారత సంతతి వ్యక్తికి ఊరట
హత్య కేసులో చేయని నేరానికి 40ఏళ్లు US జైల్లో ఉన్న భారత సంతతి వ్యక్తి వేదం సుబ్రహ్మణ్యానికి ఊరట లభించింది. ఇటీవలే నిర్దోషిగా విడుదలైన ఆయనను దేశం నుంచి డిపోర్ట్ చేయొద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులను రెండు కోర్టులు ఆదేశించాయి. ఆయన కేసును రివ్యూ చేయాలా వద్దా అన్న దానిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అప్పీల్స్ నిర్ణయం తీసుకునే వరకు దేశం నుంచి బహిష్కరించొద్దని తెలిపాయి.