ఐఫోన్‌ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

ఐఫోన్‌ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

VSP: ఐఫోన్‌ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. పాతనగరం కోటవీధిలో నివాసముంటున్న బాలుడు(17) 6వ తరగతి వరకు చదివి మానేశాడు. వారం రోజుల క్రితం బాలుడు తన తండ్రిని ఐఫోన్‌ కొనివ్వాలని అడిగాడు. దీంతో తండ్రి తన వద్ద అంత డబ్బు లేదని, తన వల్ల కాదని చెప్పేశాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.