నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం నా బాధ్యత

BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఆదివారం పర్యటించారు. అనంతరం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించారు. ఎలమందల వీణా వాసు కుటుంబ సభ్యులను వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడం నా బాధ్యత అని తెలిపారు.