VIDEO: అడవి పందుల దాడితో వందల ఎకరాల్లో పంట నష్టం

NDL: కొత్తపల్లి మండల పరిధిలోని ముసలిమడుగు, గుమ్మడాపురం, సింగరాజుపల్లి గ్రామాల పరిధిలో సాగుచేసిన మొక్కజొన్న పంటలను అడవి పందులు దాడి చేసి తీవ్ర నష్టం మిగిలిస్తున్నాయి. వందల ఎకరాల్లో కంకి దశలో ఉన్న పంటలు ధ్వంసం అవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.